కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అప్పులు, నిరుద్యోగం, అసమానతలు పెరిగాయని ఆరోపించింది. ప్రతి భారతీయుడి తలపై ఉన్న అప్పులు 2.53 రెట్లు పెరిగాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. అప్పులు పెరగడానికి ప్రధాని మోదీ విధానాలే కారణమని విమర్శించారు. 9 ఏళ్ల క్రితం సామాన్యుడిపై రూ.43,124 అప్పు ఉండగా, నేడు 1,09,373కి చేరిందన్నారు.