కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ప్రజలకు విస్తృత సేవలు అందించారని నిజాంపట్నం ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి తెలిపారు. సోమవారం నిజాంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నందు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సిబ్బంది అందిస్తున్న సేవలకు ప్రైవేటు ఆసుపత్రులు కంటే ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చొరవ తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కన్నా శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, పరిసా శ్రీలక్ష్మి పాల్గొన్నారు.