ఇండోనేషియా ప్రజలను మరోసారి భూకంపం వణికించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం అర్థరాత్రి భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు బయటకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు USGS వెల్లడించింది. సముద్ర మట్టానికి 12 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.