బీహార్లో కల్తీమద్యం మరోసారి తీవ్ర కలకలం రేపింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు కంటిచూపు కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని తెలుస్తోంది. అయితే శవపరీక్ష తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కల్తీ మద్యం అక్రమ రవాణా చేస్తున్న 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.