నేడు కేబినెట్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. బడ్జెట్ సమావేశాల ముందుగా కేబినెట్ సమావేశం నిర్వహించనుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కావడంతో పలు రాష్ట్రాలకు వరాలు కురిపించే అవకాశాలు ఉంది.