శారద నగర్ ఎంవిఆర్ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలతో చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రిలో చేరిన బాధితుడు నాగేశ్వరరావు సోమవారం మరణించినట్లు టౌన్ పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటూ హాలులో సిగరెట్ కాలుస్తూ పక్కన పడేసి నిద్రపోయాడు. కాలిన సిగరెట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.