రానున్న ఉగాది పండుగ లోపు జగనన్న కాలనీలలో సామూహిక గృహప్రవేశాలకు ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జీడి నెల్లూరు ఎంపీడీవో శ్రీదేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో మండల పరిధిలోని కనికాలమ్మ కాలనీ ఎల్లమ్మరాజుపల్లె లో జగనన్న లేఅవుట్లను పరిశీలించారు.
అనంతరము సిబ్బందితో మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి రానున్న ఉగాది పండుగకు ప్రభుత్వ ఆదేశానుసారము సామూహిక గృహప్రవేశాలకు సిద్ధం కావాలన్నారు. ఇంటి నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు సంబంధిత ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉండాలన్నారు.
ప్రజలకు ఏవైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చి సకాలంలో సమస్యను పరిష్కరించుకొని ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.