పెద్దవడగూరుకు చెందిన అమర వీర జవాన్, కీర్తి చక్ర అవార్డు గ్రహీత కుమ్మెత సుదర్శనరెడ్డి త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి మంగళవారం పేర్కొన్నారు. పెద్దవడగూరులో ఉన్న సుదర్శనరెడ్డి విగ్రహం, స్థూపాన్ని ఎస్పీ మంగళవారం సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. 2001 లో కాశ్మీర్ ప్రాంతంలో అసువులు బాసిన సుదర్శన్ రెడ్డి స్వస్థలం పెద్దవడగూరు కావడం ఈ గ్రామస్తులందరూ గర్వపడాలి. దేశ రక్షణలో సైనికుల పాత్ర చాలా కీలకం. అత్యల్ప చలిలో కూడా దేశ సరిహద్దుల్లో విధులు చేస్తూ ప్రాణ త్యాగాలకు వెనుకాడారు. అలాంటి త్యాగధనుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పామిడి రూరల్ సి. ఐ రామకృష్ణ, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.