‘‘నారా లోకేశ్ అసలు మా దృష్టిలో నాయకుడే కాదు. వాళ్ల తండ్రి మాజీ సీఎం కావడంతోనే అతన్ని గుర్తు పడుతున్నాం’’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. చిత్తూరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర గురించి మీడియా ప్రశ్నించగా... ‘‘పాదయాత్రా.. బొక్కా..? ఆయన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో విజయా పాల డెయిరీ, సహకార చక్కెర కర్మాగారాలను మూతేశారు. లోకేశ్ పాదయాత్ర చేయాలంటే ఆ ఫ్యాక్టరీలను మూసినందుకు జిల్లా ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలి’’ అని నారాయణస్వామి డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa