అనంతపురం జిల్లా, రొద్దం, మండలంలోని గౌనిమేకలపల్లికి చెందిన వృద్ధుడు చాకలి నారాయణప్ప(65) సోమవారం మునిముక్తావది నదిలో చేపలవేటకు వెళ్లి, ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం....... నారాయణప్ప మరోవ్యక్తితో కలిసి గ్రామ సమీపంలో ఉన్న నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్లారు. లోతుగా ఉన్న గుంతలోకి వెళ్లగా నీ టిలో మునిగి ఈతరాక గల్లంతయ్యాడు. బంధువులు, గ్రామస్థులు సా యంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్ఐ నాగస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.