దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ మహిళ ఏకంగా ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్నే మార్చేసుకుంది. చెన్ వైల్ అనే మహిళ 1997లో చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వర్తించే క్రమంలో రూ.6.8 కోట్లను తన ఖాతాలోకి జమ చేసుకుంది. కొంత డబ్బును తన పుట్టింట్లో దాచుకుంది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అలా 25 ఏళ్ల పాటు దొరక్కుండా తిరిగిన ఆమెను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.