లండన్ లో ఇటీవల జరిగిన ఓ పంజాబీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ భారతీయ సంప్రదాయంలో జరిగిన పెళ్లిలో డ్యాన్స్ చేసేదంతా ఇండియన్స్ అయినా బ్యాండ్ బాజా వాయించేది మాత్రం ఇంగ్లాండ్ దేశస్థులు. భారతీయ పెళ్లిలో బరాత్ చాలా ముఖ్యమని తెలుసుకున్న బ్రిటిషర్స్.. ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని బ్యాండ్ బాజా వాయిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.