మంగళవారం సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు స్వల్ప లాభంతో 60,978కు చేరగా.. నిఫ్టీ 18,118 వద్ద స్థిరపడింది. మార్కెట్లు లాభాలతో ప్రారంభం కాగా రియాల్టీ, మెటల్, ఫార్మా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లలో నష్టాలు నమోదు కావడం ప్రతికూల ప్రభావం చూపింది. టాటా మోటార్స్, మారుతి, హెచ్ డీఎఫ్ సీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలు నమోదు చేశాయి.