ఉత్తర సిరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలెప్పో నగరంలో ఆదివారం ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 16 మంది భవన శిథిలాలలో చిక్కుకుని చనిపోయారు. చాలా మంది శిథిలాల కిందే ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ టీమ్లు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. నీటి లీకేజీ కారణంగా పునాది బలహీనంగా ఉండడంతో భవనం కూలిపోయిందని దర్యాప్తులో తేలింది.