ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగితే మెటబాలిజం మెరుగ్గా పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మొటిమలు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను పోగొడుతుంది. పాలిచ్చే తల్లులు మెంతి నీరు తాగితే పాల ఉత్పత్తి పెరుగుతుంది.