తమలపాకులు నోటి దుర్వాసనను, శరీర దుర్వాసనను పోగొడతాయి. ఇవి దంతాలను దృఢపరచడమే కాకుండా దంతాల నుంచి వచ్చే బ్లీడింగ్ ని ఆపేస్తాయి. వీటిలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు క్రిములను నాశనం చేస్తాయి. తమలపాకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలుంటే ఒక టీ స్పూను తమలపాకు రసం తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.