అస్సాంలోని గోల్పరా జిల్లాలో దారుణం జరిగింది. ఓ 40 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలల క్రితం 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో గర్భం దాల్చిన ఆ బాలిక బార్పేటలోని ఆసుపత్రిలో సోమవారం ప్రసవించిన తర్వాత మృతిచెందింది. బాలిక మరణించిన 24 గంటల్లోనే ఆమె బిడ్డ కూడా చనిపోయింది. ఈ విషయం చెబితే నిందితుడు చంపేస్తానని బెదిరించాడని బాలిక కుటుంబం తెలిపింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.