విమానాల్లో ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాల్లో మద్యం అందించే విధానానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా ఎవరైనా ప్రయాణికులు స్థాయికి మించి మద్యం తీసుకుంటున్నారని భావిస్తే వారికి సర్వ్ చేయడానికి నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. ఈ విషయం చెప్పడానికి ప్రయాణికులతో వాదనకు దిగకూడదని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa