వాల్‌నట్స్ లో ఇ, బి6 విటమిన్లు, మెలటోనిన్, పాలీఫినాల్స్, థయామిన్, పాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు, రొమ్ము క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. ఇవి వృద్ధాప్యఛాయలు రాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లోని బయోటిన్ జుట్టు రాలే సమస్యను పోగొట్టి, జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. వాల్‌నట్స్ ఆస్త్మా, కీళ్లనొప్పులు, టైప్ 2 మధుమేహం వంటి వాటిని పోగొడతాయి. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.