సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో ఐబీఎం కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. వార్షిక నగదు లక్ష్యాలు తగ్గడం కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.5 శాతం మాత్రమేనని పేర్కొంది.