మాంసాహారం తిన్నాక పాలు తాగడం వల్ల అనేక నష్టాలున్నాయి. చికెన్, మటన్, రొయ్యలు, చేపల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలలో కూడా ప్రొటీన్ ఉంటుంది. ఇవి రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరంలోకి పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు చేరి యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతాయి. శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. జీర్ణ క్రియ సాఫీగా సాగదు. బద్దకం ఏర్పడుతుంది. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.