రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ భిశ్వభూషన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభ సమయంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని అన్నారు.