పోలీసులకు చెల్లించవలసిన లీవ్ ఎన్క్యాష్మెంట్ సక్రమంగా ప్రభుత్వం అమలు చేయడం లేదని, తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సమయం హేమంత్ కుమార్ మంత్రి బొత్ససత్యానారాయణకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్లో ఆయనకు ఓ వినతిపత్రం అందజేశారు. అలాగే మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణకు వినతిప్రతం అందజేశారు. ఈ సమస్యలను ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తానని ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు , యూనిఫామ్ పోస్ట్ లో ఉన్నవారికి రావలసిన డిఏలు , అడిషనల్ సరెండర్ రెగ్యులర్ మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. యూనిఫామ్ పోస్ట్ లో ఉన్న పలీసులకు ప్రతినెలా రావలసిన టిఏ బకాయిలు 2021 నుంచి చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా కాపునాడు ఉపాధ్యక్షులు కసరం హరీష్, బుద్దాల కృష్ణ మోహన్, జగన్ మురారి, గిరీష్ పాల్గొన్నారు.