ముల్తానీ మట్టి చర్మ సంరక్షణకే కాదు జుట్టుకు కూడా వాడతారు. దీనిలో ఉండే మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, క్యాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కప్పు ముల్తానీమట్టిలో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి, దానికి గుడ్డులోని తెల్లసొన, ఓ కప్పు నువ్వుల నూనె కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుని శీకాయతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.