మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన పెద్ద కోనేరు అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఎమ్మెల్సీ హనుమంతరావు, గంజి చిరంజీవి లతో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని దేవాదాయ శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి కొనేరును అభివృద్ధి పరచి ఇందులోని నీటిని వాడుకలోకి తీసుకువచ్చి భక్తులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో వైకాపా పట్టణ పార్టీ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.