జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హాకీ జట్టు ఎంపికను ధర్మవరం బాలుర ఉన్నత పాఠ క్రీడా మైదానంలో నిర్వహించారు. 3, 4 తేదీల్లో కాకినాడలో జరగనున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి హాకీ లీగ్ టోర్నమెంట్లో ఈ జట్టు పాల్గొననుందని జిల్లా ముఖ్య శిక్షకుడు జగన్నాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా జట్టుకు వెంకటేష్ నాయక్, మహమ్మద్రఫి, నవీన్ కుమార్, బాల ఓబులేసు, లోకేష్, ఈశ్వర్, మహమ్మద్ బాష, జగన్, ప్రశాంత్, దుర్గ, ఎం. లోకేష్, చరణ్ తేజ, సుధాకరా బాబు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమం లో శ్రీ సత్యసాయి జిల్లా హాకీ కోచ్ హసేన్, అనంతపురం జిల్లా హాకీ కోచ్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa