పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల యానియన్ బ్యాంక్ గోల్డ్ మాయం వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బ్యాంక్ ఎదుట ఖాతదారులు ఆందోళనకు దిగారు. నగదు చెల్లించినా బంగారం ఇవ్వకుండా సిబ్బంది మాయమాటలు చెబుతున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది బంగారాన్ని వెంటనే తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత మంది బంగారం మాయం అయిందనే సమాచారం తెలపాలని ఖాతదారులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకుల్లోనే భద్రత లేదంటూ ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదు.