వేటపాలెం మండలం దేశాయిపేటలో షేక్ నజ్మా (27)అనే వివాహిత గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందడంతో వేటపాలెం ఎస్సై సురేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్నిపరిశీలించిన అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. షేక్ నజ్మా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, దీంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పారని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు.