ప్రయాణికుల పై రిజర్వేషన్ భారం పడకుండా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ చార్జీ రూ. 20 నుండి రూ. 5 తగ్గించడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నంలోని ద్వారక నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నరసన్నపేట, టెక్కలి పలాస, సోంపేట, ఇచ్చాపురం వెళ్లే ప్రయాణికులకు ఉదయం 9గంటల వరకు రాత్రి 11గంటల వరుకు అన్ని రకాల బస్ సర్వీసులు నడపడంతో పాటు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే విసులుబాటు కల్పించడం జరిగిందని అన్నారు.
రిజర్వేషన్ కౌంటర్లు కూడా పలాస, ఇచ్చాపురం బస్ ఫ్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, కార్ షెడ్, మధురవాడల్లో పికప్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు నేరుగా ఇంటి వద్ద నుంచే రిజర్వేషన్ చేసుకున్నట్లయితే, సమయంతో పాటు సీటు కూడా కన్ఫర్మ్ అవుతుందని అన్నారు. ముఖ్యంగా రానుపోను చార్జీలు ఒకేసారి బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుందని ఆయన ప్రకటనలో వివరించారు.