ప్రేమ పేరుతో వృద్ధుడికి వలపు వల విసిరిన మహిళ పెళ్లి చేసుకుని సర్వం దోచేసింది. తమిళనాడుకు చెందిన మల్లిక అలియాస్ మల్లర్ (35), భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్న షణ్ముగం (69) అనే వృద్ధుడిని పరిచయం చేసుకుని రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్లు షణ్ముగంతోనే కలిసి ఉన్న మల్లిక ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి వస్తువులతో సహా కొంత నగదు తీసుకుని పరారైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు .