కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులపై కల్తీ మద్యం ముఠా దాడి చేసిన ఘటన బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అర్రాహ్ సమీపంలోని ఘఘాలోని మహాదళిత్ తోలాపై దాడి చేసేందుకు ఎక్సైజ్ శాఖ బృందం వెళ్లింది. వీరిపై కల్తీ మద్యం ముఠా దాడి చేయడంతో 11 మందికి గాయాలయ్యాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.