ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెరువు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకు వచ్చారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. రేపల్లె పట్టణంలోని 8, 10 సచివాలయ నూతన భవనాలను శనివారం ఎంపీ మోపిదేవి ప్రారంభించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కట్ట మంగ, వైస్ ఛైర్మన్ గుజ్జర్లమూడి ప్రశాంత్, రేపల్లె పట్టణ వైసిపి అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, నాయకులు పాల్గొన్నారు.