ప్రకాశం జిల్లా, మార్కాపురంలో మద్యం మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అధికారపార్టీకి చెందిన నేతలు నిర్వహించే ప్రైవేటు దాబాలకు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి నేరుగా మద్యం సరఫరా అవుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పాటు ప్రైవేటు రెస్టారెంట్ యజమానులు చేతులు తడుపుతుండటంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.