ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శనివారం నాడు వేటపాలెంలోని సారస్వత నికేతన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల డిపిఆర్ఓ మోహన్ రాజు, గ్రంథాలయ నిర్వహకులు, స్థానిక పాత్రికేయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొమ్మినేని శ్రీనివాసరావు లైబ్రరీలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఈ గ్రంథాలయంలో ఉన్న పురాతన తాళపత్రాలు, అమూల్యమైన గ్రంధాలను కూడా ఆయన తిలకించారు. మహాత్మా గాంధీ చేతి కర్ర, రాట్నం చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రంథాలయ అభివృద్ధికి పర వంతు చేయూత అందిస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.