నంద్యాల మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోర్టులో కేసు పేరుతో జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల మండల సమితి ఆధ్వర్యంలో పేదలతో కలిసి నంద్యాల సిపిఐ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు శనివారం ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమాని సంఘం జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికిపైగా ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతమంది ఇండ్లు లేని పేదలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎక్కడ వచ్చిందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.