మొక్కల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా బొగ్గు గనుల త్రవ్వకాలకు శాశ్వత పరిష్కారం లబిస్తుందని కెఎల్ విద్యాలయం రసాయనిక శాస్త్ర విబాగ అధిపతి డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కెఎల్ యు ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ కెమిస్ట్రీ ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా సదస్సులో పాల్గొన్న రసాయనిక పరిశోధకులు పలు పేపర్లను ప్రదర్శించారు. వాటిలో ఉత్తమ పేపర్లను ఎంపిక చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని రకాల మొక్కల ను పెంచి వాటిని ప్రక్రియ చేయడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చునని తెలిపారు. హైడ్రోజన్ గ్రీన్ హౌస్ వాయువులతో విద్యుత్ ను ఉత్పత్తి చేయడం వలన కాలుష్యం నివారించవచ్చునన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ అల్కా కాంబ్లే మాట్లాడుతూ సహజ వాయువులతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. అయితే రానున్న కాలంలో సహజ వనరులతో విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి కృషి జరుగుతుందన్నారు.
ఇథనాల్, మిథనాల్ తో పాటు ఆల్కహాల్ తో విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే జరుగుతుందన్నారు. హైడ్రోజన్ సెల్స్ తయారి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి కృషి చేస్తున్నట్లు పలువురు రసాయనిక పరిశోధకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్. జగన్నాథరావు, ప్రొ. విసి. డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జగదీష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రమణ్యం, సలహాదారు, విద్యార్ధి వ్యవహారాల డీన్ డాక్టర్ కెఆర్. ఎస్. ప్రసాద్, డాక్టర్ జె. వి. షణ్ముఖ కుమార్, డాక్టర్ ఎ. వాణి, ఇతర అధ్యాపకులతో పాటు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.