అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ప్రతిపక్ష టిడిపిలోకి వలసలు జోరు కొనసాగుతోంది. సైకిల్ జోరుకు ఫ్యాన్ బేజారెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరేందుకు క్యూకడుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు ఎక్కువయ్యాయి. టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం 200 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం కండువాలు కప్పుకుని పార్టీలో చేరాయి.
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం నుండి మండల వైసీపీ కీలక నేత వెనిగళ్ళ కృష్ణప్రసాద్ తో పాటు 140 కుటుంబాలు, మంగళగిరి మండలం కృష్ణయపాలెం గ్రామం నుండి గ్రామ వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు ఈపూరి రాజు, ఈపూరి కిషోర్, ఈపూరి జోజమ్మ, ఈపూరి మస్తాన్ ల ఆధ్వర్యంలో 46 యస్సీ కుటుంబాలు, తాడేపల్లి రూరల్ మండలం ఉండవల్లి నుండి కోట దినేష్, కుంచనపల్లి నగేష్, బండిగల్ల ఆనంద్, జెర్రిపోతు రాజు పోకూరి వర్మ మరియు 20 మంది యువకులు,
దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం షేక్ నాగూర్ వలి, షేక్ ఖాసీం మరియు 25 వైసీపీ కుటుంబాలు, కంఠం రాజు కొండూరు గ్రామం నుండి వల్లభాపు అవినాష్ దావులూరి కోటేశ్వరరావు మరియు ఎనిమిది వైసిపి కుటుంబాల కు పసుపు కండువా కప్పి నారా చంద్రబాబు నాయుడు టిడిపిలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్ధయ్య, టిడిపి రాష్ట్ర అధికార తమ్మిశెట్టి జానకి దేవి, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, టిడిపి సీనియర్ నాయకులు జంగాల సాంబశివరావు, మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గాదె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.