గుంటూరు జిల్లాలో, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉండి స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతికి, అంగీకార పత్రం ఇచ్చిన వారికి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె బసవలింగ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సంఘ నాయకులు ఈ అంశంపై డీఈవో శైలజను కలిసి వినతి పత్రం అందజేశారు. బసవలింగ మాట్లాడుతూ 2022 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి ఉద్యోగున్నతికి అన్ని సబ్జెక్టుల అనుమతి పత్రం తీసుకున్నారన్నారు.