గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పొన్నూరు పట్టణంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆదివారం కలెక్టర్ దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కలెక్టర్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అధికారులు పాల్గొన్నారు.