శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం రామచంద్రపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆది దేవుడు పోతురాజు స్వామివారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అలాగే రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ముఖ్య అతిథులుగా శనివారం పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ గ్రామస్తులు కలసికట్టుగా ఆలయ నిర్మాణానికి పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ (శ్రీను), టిడిపి విశాఖ పార్లమెంట్ బీసీ కమిటీ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు, కొత్తవలస మండల ప్రధాన కార్యదర్శి కనకాల శివ, కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలం అర్జునరావు, నక్కరాజు చిన్న రాము, గొంప దుర్గ ఉమేష్, విశాఖ టిడిపి పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విరోతు శివాజీ, వెలము కార్పొరేషన్ డైరెక్టర్ కోటాన విజయ్ కుమార్, అక్కిరెడ్డి వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa