ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో భక్తజన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన స్వామి అమ్మవార్ల దర్శనం నిర్విరామంగా కొనసాగింది.