చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు టెన్ పాయింట్ ఫార్ములా అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక లోక్ సత్తా పార్టీ నాయకులు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని కలిసి వినతిపత్రం అందించారు. తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలని కోరారు.