సీఎం భద్రత పేరుతో అధికారులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సీఎం ఎక్కడ బహిరంగ పర్యటన ఉంటే, అక్కడ ఉండే పచ్చని చెట్లను నరికివేయిస్తున్నారు. , భద్రతాసిబ్బంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు ప్రధాన రహదారిపై చెట్లను నరికివేసిన అధికారులు, మొన్న విశాఖలోనూ అదే పనిచేశారు. తాజా ఈ నెల 30 న వినుకొండలో సీఎం పర్యటన ఉండటంతో. ఈ సారి వినుకొండ చెట్లకు వచ్చాయి తిప్పలు. చెట్లను రక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే. ఇలా విచ్చలవిడిగా నరికివేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.