గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు కార్మిక సంక్షేమ బోర్డులో తప్పకుండా కార్మికుడిగా పేరు నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ సుభాని శనివారం తెలిపారు. అరండల్ పేట 16వ లైన్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. రెండు పాస్పోర్ట్ ఫోటోలు, బ్యాంకు ఖాతా , ఆధార్ కార్డు నకలు, దరఖాస్తు, దరఖాస్తు దారుడి నామిని, యూనియన్ బ్యాంకులో చెల్లించిన 110 చలానా అందించాలన్నారు.