ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని, స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో, ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ఎంపీపీతో పాటు, పెదకూరపాడు వైస్ ఎంపీపీ, నరసరావుపేట ఉప ఎంపీపీ స్థానాలకు ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీన ఉప ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.