రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరుల సమస్యలు పరిష్కరించుటలో ముందుంటానని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ నెల 27న నెల్లూర లో జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుర్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం క్రిస్టియన్ చర్చిలపైన మత గురువులు, పాస్టర్లపైన దాడులు ఎక్కువయ్యాయన్నారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి శక్తి వంచెన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.