కోర్టు ఉత్తర్వుల మేరకు మా ఊరికి రోడ్డు సమస్య పరిష్కారం అయిందని వీరంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామానికి ఉన్న రోడ్డు స్థలంలోనే రెవెన్యూ అధికారులు కొంతమంది వైసీపీ నాయకులకు ఇంటి పట్టాలు ఇచ్చారంటూ గ్రామస్థులు సచివాలయంతో మొదలుకుని కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు లోక్ అదాలత్లో ఫిర్యాదు చేయగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా సర్వేయర్ వచ్చి పరిశీలించి కొలతలు వేశారు. ఈ కేసు ఈనెల 28న హియరింగ్ కురాగా రెవెన్యూ అధికారులు, సర్వేయర్ ఇచ్చిన స్కెచ్ మేరకు రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులు శ్రమదానం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆదివారం గ్రామస్థులు ఊరికి రోడ్డును శ్రమదానంచేసి ఏర్పాటు చేసుకున్నారు. అం మతే దీనిపై గ్రామస్తులు పలుసార్లు పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు.