రాయదుర్గం పట్టణ సమీపాన మధ్యాహ్నేశ్వర కళ్యాణమండకంలో మంగళవారం ఉదయం 11 గంటలకు వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రెడ్డి సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షుడు గౌని ఉపేంద్ర రెడ్డి మీడియా కి సోమవారం ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రప్రభుత్వం ఈనెల 19న అధికారికంగా నిర్వహించ తలపెట్టినా రాయదుర్గంలో 31 వ తేదీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. రెడ్డి కుల బాంధవులతో పాటు అన్ని కుల సంఘం ప్రతినిధులు హాజరై వేడుకల్లో భాగస్వాములు కావాలన్నారు.