ఈ ఏడాది భారత్ జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20 సమావేశాలకు వచ్చే విదేశీ ప్రతినిధులు ఫిబ్రవరి 12న తాజ్ మహల్, ఎర్రకోట, బేబీ తాజ్ తో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న నాలుగు గంటల పాటు తాజ్ మహల్ సందర్శనకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.