దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 240.39 పాయింట్ల లాభంతో 59.571 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.10 పాయింట్ల లాభంతో 17,695.45 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.67 గా ఉంది. ఎన్టీపీసీ, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.